హీరో వరుణ్ సందేశ్ చాలా ప్లాన్డ్‌గా కనిపిస్తున్నారు డే 1 నుండే. కామ్‌గా కనిపిస్తున్నాడు. కానీ, పక్కా ప్లానింగ్ అండ్ పర్‌ఫెక్ట్ అనిపిస్తున్నాడు. తొలిరోజే స్విమ్మింగ్ పూల్‌ని వాడేశాడు. పూల్ పక్కన నిలబడి ఉన్న తన భార్య వితికాని మళ్లీ రెండు చేతులతో ఎత్తి నీళ్లలోకి తోసేశాడు. సో వైఫ్ అండ్ హజ్‌బండ్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లు బాగానే ఫాలో చేస్తున్నారు హౌస్ లోపల. ఎంట్రీ నైట్ పడుకునే ముందు బెడ్ విషయంలో వితికా గారాలు పోవడం, తనకి అదే బెడ్ కావాలని మారాం చేయడం, కాదు, కాదు అమ్మాయిలంతా ఒక సైడ్ అంటూ వితికా చెప్పడం.. ప్రేక్షకుల్లో ఆసక్తిగా అనిపించింది.
ఇక వితికా విషయానికి వస్తే, ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది వితికా. హజ్‌బెండ్‌తో పాటు, మిగిలిన వారితోనూ బాగానే ఇంటరాక్ట్ అవుతోంది. గేమ్ స్పిరిట్ బాగానే ఉన్నాయనిపిస్తోంది వితికా ఆటిట్యూడ్ చూస్తుంటే. ఇదే ఆటిట్యూడ్ చివరి వరకూ కనబరిస్తే వితికా నుండి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనిపిస్తోంది. వరుణ్ మాత్రం పక్కా గేమ్ ప్లానర్ అనే అనిపిస్తున్నాడు. భార్య విషయంలో కాస్త మెతకగా కనిపిస్తున్నా, టాస్క్‌ల్లో మిగిలిన వారిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకి పర్‌ఫెక్ట్ ఐడియా ఉన్నట్లే అనిపిస్తోంది. చూడాలి మరి, ఈ ప్లానింగ్‌తో వరుణ్ ఎన్ని రోజులు నెట్టుకొస్తాడో. ఫస్ట్ డే 15 మంది హౌస్ మేట్స్ సందడితోనూ కలర్‌ఫుల్‌గా బిగ్ హౌస్, ఆడియన్స్‌ని బాగానే స్టే ట్యూన్డ్ చేసిందనాలి.