మెగా ప్రిన్స్ 'వరుణ్ తేజ్' తాజా చిత్రం 'వాల్మీకి'...'గద్దలకొండ గణేష్' గా పేరు మార్చుకుని బాక్సాఫీస్ ను గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. 'హరీష్ శంకర్' దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో...'వరుణ్' ఊర మాస్ అవతారమెత్తి, గత్తర లేపిండు అని సినిమా చూసిన వాళ్లంతా చెప్పుకుంటున్నారు. 'గబ్బర్ సింగ్' తరువాత 'హరీష్ శంకర్' కి మళ్ళీ బ్రేక్ వచ్చిందని.. ఈ చిత్రానికి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ని పట్టి చెప్పొచ్చు.
ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ కూడా నిన్న హైదరాబాద్ లో జరిగింది, అందులో భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ సినిమా టైటిల్ మార్చాల్సి వచ్చినప్పుడు తను ఫేస్ చేసిన సందర్భం ఒకటి చెప్పాడు. ఈ చిత్రానికి 'వాల్మీకి' కాకుండా 'గద్దలకొండ గణేష్' అనే టైటిల్ మారుస్తున్నారని తెలిసినప్పుడు వరుణ్ చాలా ఒత్తిడి కి గురయ్యాడట.. ఏం చేయాలో తెలియక తన అన్న 'రామ్ చరణ్' కు ఫోన్ చేసాడట.. అప్పుడు 'చరణ్' ఇంటికి రమ్మని చెప్పగా, వరుణ్... రామ్ చరణ్ ఇంటికి వెళ్ళాడట.
అక్కడ చరణ్ తో పాటు 'ఎన్టీఆర్' కూడా ఉండటం తో.. ఇద్దరూ కలిసి వాళ్ళ అనుభవాలను వరుణ్ తో పంచుకున్నాక తను ఎదుర్కొన్న టెన్షన్ మొత్తం జీరో అయ్యిందట. ఆ సంఘటన గుర్తు చేసుకుని చరణ్, ఎన్టీఆర్ లకు థాంక్స్ చెబుతూ... ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ సక్సెస్ మీట్ ద్వారా పంచుకున్నాడు వరుణ్.