శ్రీముఖి అండ్‌ గ్యాంగ్‌ బిగ్‌ డిజప్పాయింట్‌మెంట్‌.!

మరిన్ని వార్తలు

గత 60 రోజులుగా బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 15 మంది కంటెస్టెంట్లు, 2 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలతో అప్పుడప్పుడూ జోష్‌ నింపుతూ, కొన్నిసార్లు బోర్‌ కొట్టిస్తూ, అలా అలా పడుతూ, లేస్తూ రన్‌ అవుతోంది. అయితే, ఈ సీజన్‌లో వచ్చిన రెండు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ సుద్ద వేస్ట్‌ అనీ ఆడియన్స్‌ ఎప్పుడో తేల్చేశారు. గెస్ట్‌ హోస్ట్‌ని ఎంకరేజ్‌ చేశారు. గెస్ట్‌ హోస్ట్‌గా వచ్చిన రమ్యకృష్ణ హోస్టింగ్‌కి ఆడియన్స్‌ చాలా సంతృప్తిగా ఉన్నారు.

 

మళ్లీ మళ్లీ అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ చేస్తున్నారు కూడా.. అయితే, ఇది ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్‌. ఇది కాసేపు పక్కన పెట్టేసి, హౌస్‌లోకి వెళ్లిపోదాం. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఎక్స్‌పెక్టేషన్స్‌ మరోలా ఉన్నాయి. 50 వరోజు హౌస్‌ నుండి బయటికి వెళ్లిపోయిన హ్యాండ్‌సమ్‌ అలీ రీ ఎంట్రీ కోసం హౌస్‌లోని కొందరు సభ్యులు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఆ సభ్యులు మరెవరో కాదు, శ్రీముఖి, బాబా భాస్కర్‌, రవికృష్ణ, అండ్‌ శివజ్యోతి. ఈ నలుగురితోనూ, అలీకి ఎటాచ్‌మెంట్‌ చాలా ఎక్కువ. సో అలీ వస్తే, తమ గ్రూప్‌కి స్ట్రెంత్‌ అవుతాడని వారు భావిస్తున్నారు.

 

అయితే, వారి ఆశల మీద బిగ్‌బాస్‌ నీళ్లు చల్లేశాడు. రాహుల్‌ని ఎలిమినేట్‌ చేయకుండా సీక్రెట్‌ రూమ్‌లో ఉంచి, రీ ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. దాంతో ఈ గ్రూప్‌ చాలా డిజప్పాయింట్‌ అయ్యింది. అలీ వస్తాడనుకుంటే, రాహుల్‌ వచ్చాడేంట్రా అని తెగ ఫీలయిపోయింది. ఒకానొక సమయంలో ఈ గ్రూప్‌, ముఖ్యంగా శ్రీముఖి, డిస్కషన్‌లో భాగంగా రాహుల్‌ గురించి బ్యాడ్‌గా మాట్లాడడం, ఐ హేట్‌ రాహుల్‌.. అండ్‌ ఐ లైక్‌ అలీ.. అని చెప్ప డం ద్వారా వీరి గుట్టు బయట పడిపోయింది. రాహుల్‌ ఎంటర్‌ అయిన క్షణంలో వారి ముఖాల్లో అవే ఎక్స్‌ప్రెషన్స్‌ చూపించి బయట పడిపోయారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS