వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఐతే ఇప్పటివరకూ వీరి ప్రేమకథ గురించి ఇద్దరిలో ఎవరూ బయటికి చెప్పలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వరుణ్ తన ప్రేమకథ గురించి ఏం మాట్లాడలేదు. ఎ'ప్పుడో ఆరేళ్ళ క్రితం జరిగింది, ఏం గుర్తులేదు, ఇప్పుడు 'గాండీవధారి అర్జున’ సినిమా గురించే మాట్లాడుదామని సున్నితంగా నవ్వేశారు వరుణ్ .
గాండీవధారి అర్జున’ సినిమాపై చాలా నమ్మకంగా వున్నాడు వరుణ్. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఫారిన్ లోకేషన్స్ లో షూట్ చేశారు. ప్రమోషన్స్ కూడా ప్లాన్ గా చేస్తున్నారు. ఇప్పుడు తన ప్రేమకథ గురించి మాట్లాడితే అదే మెయిన్ టాపిక్ అవుంతుంది. అందుకే ఆ విషయాన్ని దాచేశాడు వరుణ్.
2017లో విడుదలైన ‘మిస్టర్’ కోసం వరుణ్ - లావణ్య తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్లో ‘అంతరిక్షం’ వచ్చింది. ఈ క్రమంలోనే వీరి స్నేహం ప్రేమగా మారిందని చెబుతుంటారు. కానీ వరుణ్ మాత్రం తన ప్రేమకథ గురించి బయట మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.