వరుణ్‌తేజ్ ఇప్పుడు చాలా చాలా బిజీ అయిపోయాడు. ఓ పక్క వెంకటేష్‌తో కలసి 'ఎఫ్ 2'అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. మరోవైపు సోలో హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ `అంతరిక్షం` డిసెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా మరో సినిమాపై సంతకం పెట్టాడు.
కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు వరుణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. ఇందులో వరుణ్ బాక్సర్‌గా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. అందుకోసం వరుణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోబోతున్నాడట.
`ఎఫ్ 2` ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. ఆ తరవాతే.. ఈ కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వివరాలు త్వరలో తెలుస్తాయి.