మహేష్ బాబు సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ రావడం అంటే మాటలా...??  అందులోనూ ఫ్లాప్ హీరోయిన్‌కి. ఓ రకంగా అది నక్కతోక తొక్కినట్టే. సోనాల్ చౌహాన్‌కీ ఆ అదృష్టం వరించింది. 
మహేష్ తాజా చిత్రం `మహర్షి`లో రెండో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. `డిక్టేటర్`, `పండగ చేస్కో`లాంటి ఫ్లాప్‌సినిమాల్లో కనిపించింది సోనాల్. తను చేసిన సినిమాలు, పాత్రలు ఆమెకు ఎలాంటి గుర్తింపునీ తీసుకురాలేదు. అయినా సరే - భీకరమైన పోటీ మధ్య `మహర్షి`లో ఛాన్స్ కొట్టేసింది. 
మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే ఓ కథానాయికగా నటిస్తోంది. మహేష్ పాత్ర మూడు కోణాల్లో ఉంటుందని,  రైతుల సమస్యలపై పోరాడే వ్యక్తిగా మహేష్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. 
అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 2019 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.





 
 





 
  
  
  
  
  
  
  
  
					                 
                                


