మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ లేటెస్ట్ మూవీ ‘బాక్సర్’ని తాజాగా పట్టాలెక్కించారు. వైజాగ్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లేటెస్ట్గా స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. దీనికి సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వరుణ్ తేజ్. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అల్లు వెంకటేష్, సిద్దు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ గత కొన్ని నెలలుగా బాక్సింగ్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాక్సర్‌కి ఉండాల్సిన బాడీ ఫిట్నెస్ కోసం నిపుణల పర్యవేక్షణతో రకరకాల కసరత్తులు చేశాడు వరుణ్. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కింది.
Back to sets!
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 24, 2020
Day 1 in vizag..
Need all your love!!🤗🤗🤗#VT10 pic.twitter.com/3C35pZXqsE
వైజాగ్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత తదుపరి షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌లో ఓ భారీ సెట్ ప్లాన్ చేయనున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో వరుణ్‌తో జత కట్టబోయే ముద్దుగుమ్మ కోసం కూడా వేట గట్టిగానే కొనసాగింది. ఎట్టకేలకు బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ పేరు పరిశీలనకొచ్చింది. ‘దబాంగ్ 3’లో నటించిన ఈ ముద్దుగుమ్మ వరుణ్‌కి సరి జోడీ అని భావిస్తున్నారు. అయితే, ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ కొట్టిన ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు