మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం 'బాక్సర్' షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలయింది. బాక్సింగ్ నేపధ్యం లో సాగే చిత్రమిది. దీనికోసం వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్ లుక్ కోసం భారీగా బాడీ కూడా పెంచేసాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ షెడ్యూల్ ఒకటి వైజాగ్ లో ఇదివరకే జరిగింది. లాక్ డౌన్ కు ముందు మార్చ్ లో ఈ షెడ్యూల్ పూర్తయింది. దాదాపు 6 నెలల గ్యాప్ తరువాత వరుణ్ తేజ్ మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడు.
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ను ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎంపిక చేశారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఈ చిత్రం లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన కూడా త్వరలోనే ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిద్దూ ముద్ద మరియు అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు.