2017 మిస్ యూనివర్స్‌గా నిలిచింది మానుషి చిల్లర్. అయితే ఈ విశ్వ సుందరి సినీ ప్రయాణం మాత్రం డిజాస్టర్ తో మొదలైయింది. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ కథానాయికగా అవకాశం అందుకుంది మానుషి. అయితే ఆ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ని అందుకుంది. దీంతో ఫ్లాఫ్ హీరోయిన్ అనే ముద్ర ఆమెపై పడిపోయింది.
అయితే అనూహ్యంగా ఆమెకు తెలుగు నుంచి ఓ ఆఫర్ అందింది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెలుగు, హిందీ భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా, ఓ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్‌తేజ్ సరసన మానుషి చిల్లర్ నాయికగా ఎంపికైంది. మొత్తానికి బాలీవుడ్ లో ఫ్లాఫ్ అయిన ఈ అందాల సుందరి మెగాహీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచేస్తుంది.