వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వరుణ్ తేజ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి నెలని లవ్ మంత్‌గా ముద్దుగా పిలుచుకుంటూంటాం. ఎందుకంటే 'పిబ్రవరి 14'ని లవర్స్డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి. అందుకే లవర్స్‌డే సందర్భంగా వరుణ్ తేజ్ సినిమాని విడుదల చేయాలని భావించి, చిత్ర యూనిట్ ఈ సినిమాని ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. క్యూట్ అండ్ డిఫరెంట్ లవ్‌స్టోరీ ఈ చిత్రం. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుండీ డిఫరెంట్ మూవీస్‌ని ఎంచుకుంటూ వస్తున్నాడు. మాస్ ఆడియన్స్‌ని మాత్రమే టార్గెట్ చేయకుండా, క్లాస్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఎట్ ది సేమ్‌టైమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందంలో రాకుమారుడు, ఆరడుగుల ఆజానుబాహుడు. అందుకే అమ్మాయిల మనసు దోచేశాడు. ఇటీవలే 'ఫిదా'తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. లవర్ బోయ్‌గా అమ్మాయిల మనసుల్లో స్థానం పదిలం చేసుకున్నాడు. ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకే మళ్లీ ఈ కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. వెంకటేశ్వరా సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు. అన్నట్లు ఈ సినిమా వరుణ్‌కి ఆరో సినిమా.