ఆ జంటని చూసి 'ఫిదా' కావాల్సిందే

మరిన్ని వార్తలు

వరుణ్‌ తేజ్‌ - సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న సినిమా 'ఫిదా'. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. హిట్‌ చిత్రాల ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాపై అంచనాలు బాగున్నాయి. శేఖర్‌ కమ్ముల సినిమాల్లో లవ్‌ టచ్‌ బాగుంటుంది. చాలా గమ్మత్తుగా ఉంటుంది పాత్రల క్యారెక్టరైజేషన్‌. ఏదో తెలీని మాయ ఉంటుంది. ఆ ప్రపంచంలోకి అమాంతం అలా తీసుకెళ్లిపోతాడు. గత చిత్రాలు చూస్తే, 'లీడర్‌' సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఎంత స్ట్రాంగో అయినా కానీ హీరోయిన్‌ లవ్‌ విషయంలో ఎంత కూల్‌గానో కనిపిస్తాడు. అలాగే 'గోదావరి' సినిమాలో అయితే ప్రతీ పెయిర్‌ ఆ క్యారెక్టర్స్‌లో తమని తాము ఊహించుకుంటారు. ఇక 'ఆనంద్‌' అయితే నిజంగానే మంచి కాఫీ లాంటి సినిమా. అలాగే 'ఫిదా' కూడా ఓ మంచి ఫీల్‌ ఉన్న సినిమా అవుతుందంటున్నారు. 'ఫిదా'లో వరుణ్‌ తేజ్‌ని చూస్తుంటే, ఖుషీ, తొలి ప్రేమ నాటి పవన్‌ కళ్యాణ్‌ గుర్తొస్తున్నాడనీ అంతా అంటున్నారు. మెగా ప్రిన్స్‌ అంటే మెగా ప్రిన్సే. స్టైల్‌, స్మైల్‌తో అమాంతం అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టేస్తున్నాడు వరుణ్‌ తేజ్‌. ఇక సాయి పల్లవి ట్రెమండస్‌ హీరోయిన్‌, పెర్ఫామెన్స్‌ విషయంలో ఇరగదీసేసిందట ఈ సినిమాలో .ఆల్రెడీ అమ్మడికి 'ప్రేమమ్‌' సినిమాతో బోలెడంత క్రెడిట్‌ వచ్చేసింది యాక్టింగ్‌ టాలెంట్‌లో. అన్నీ కలగలిసి ఈ సినిమాకి అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. 'ముకుందా' సినిమాలో కళ్లతోనే లవ్‌ బాణాలు విసిరేసిన మెగా రాకుమారుడు ఈ సినిమాలో తన రొమాంటిక్‌ చూపులతో మరింత కేక పుట్టించేయనున్నాడు. ఓకే యూత్‌ కాస్కోండి. జూలై 21న రొమాంటిక్‌ రాకుమారుడు వచ్చేస్తున్నాడు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS