'ముకుంద', 'కంచె' చిత్రాల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్‌కి టైమ్ కలిసి రావడంలేదు. మాస్ అప్పీల్‌తో వచ్చిన'లోఫర్' సినిమా నిరాశపరచినప్పటికీ, మాస్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాడు తన బాడీలాంగ్వేజ్‌తో ఈ మెగా బుల్లోడు. ఆ తర్వాత వచ్చిన 'మిస్టర్' అంటూ ఈ మధ్యనే మన ముందుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్‌లో యాక్సిడెంట్ కారణంగా వరుణ్ గాయపడడంతో షూటింగ్ ఆలస్యం కావడం, అలాగే విడుదల కూడా ఆలస్యం అయ్యింది. అంతే కాదు ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందివ్వలేదు. ఈ తరుణంలో మెగా ప్రిన్స్ ఓ ప్రయోగాత్మక కథని ఓకే చేశాడని సమాచారమ్. ప్రయోగాలు వరుణ్‌కి బాగా కలిసొచ్చాయి. యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో వరుణ్ ఓ సినిమా చేయబోతున్నాడట. సంకల్ప్, 'ఘాజీ' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దేశంలోనే తొలి జలాంతర్గామి సినిమాగా 'ఘాజీ' పేరొందింది. అత్యంత క్లిష్టమైన కథాంశాన్ని అత్యంత సమర్థవంతంగా తెరకెక్కించి సత్తా చాటాడు సంకల్ప్. వరుణ్‌తో సంకల్ప్ చేసే చిత్రం కూడా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుందట. మెగా కాంపౌండ్‌కి చెందిన ఓ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుందని తెలియవస్తోంది. ఇది కాకుండా వరుణ్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న 'ఫిదా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో వరుణ్ సరసన మలయాళ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.