గ్లామ్‌షాట్‌: గ్లామర్‌ 'వేదిక' పరిచిందిలా!

మరిన్ని వార్తలు

వేదిక. పరిచయం అక్కర్లేని పేరిది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ వంటి సౌత్‌ భాషల్లో హీరోయిన్‌గా సత్తా చాటింది. చాటుతూనే ఉంది. తెలుగులో ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు కానీ, గతంలో 'విజయదశమి', 'దగ్గరగా దూరంగా', 'బాణం' చిత్రాల్లో నటించింది. ఇటీవల లారెన్స్‌ చిత్రం 'ముని 4' (కాంచన 3)లో కనిపించింది. తమిళ సినిమా 'మదరాసి'తో హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన వేదిక గ్లామర్‌లో టాప్‌ లెవల్‌ హీరోయినే. అయితే, సక్సెస్‌ని బట్టి, క్రేజ్‌ కదా. అలా ఆమె గ్లామర్‌కి క్రేజ్‌ లేకుండా పోయింది. అందం, అభినయంలో ఈమెని సీనియర్‌ నటి నగ్మాతో పోలుస్తుంటారు. ముద్దుగా జూనియర్‌ నగ్మా అని పిలుచుకుంటుంటారు కూడా.

 

ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలోనూ ఓ సినిమాతో డెబ్యూ చేస్తోంది వేదిక. అప్పుడప్పుడూ సినిమాలతో పాటు, సోషల్‌ మీడియాలోనూ గ్లామ్‌షాట్స్‌ ఇస్తూ ఉంటుంది. అలాంటి ఓ షాట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అయ్యింది. చూస్తున్నారుగా బ్లాక్‌ అండ్‌ ఎల్లో బికినీలో వేదిక హాట్‌ హాట్‌ హొయలు. సింగిల్‌ పీస్‌ బ్లాక్‌ హాట్‌ బికినీ అది. బోటమ్‌లో ఓ ఎల్లో స్కార్ఫ్‌ లాంటి క్లాత్‌ని చుట్టిందంతే. అదో రకం గ్లామర్‌ కిక్‌ ఇస్తోందిలెండి. ఒక చేతిని నడుంపైనా, ఇంకో చేతిని తల వెనుక భాగాన సుతారంగా ఉంచి సైడ్‌ యాంగిల్‌లో కెమెరాకి పోజిచ్చిన వేదిక అందం నిజంగానే మైకం తెప్పించేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS