'కాంచన 3' సినిమాతో ఇటీవల హిట్ కొట్టిన ముద్దుగుమ్మ వేదిక, తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఫోటోలో హాట్నెస్ కన్నా, వల్గారిటీనే ఎక్కువలా కనిపిస్తోందంటూ నెటిజన్స్ నుండి కామెంట్స్ వస్తున్నాయి. అయినా అందాన్ని ఆరాధించడం ఓ కళ. ఆ కళ తెలియని కళా విహీనులు ఇలాగే మాట్లాడతారు.. అంటూ ఈ హాట్ బ్యూటీ ఇచ్చిన పోజులో ఆ కళని వెతుక్కోమని సలహాలు ఇస్తున్నారు కొందరు కళా పోషకులు. ఛైర్లో కూర్చొని, బికినీకి కాస్త ఎక్కువ అన్నట్లుగా ఉన్న ఈ కాస్ట్యూమ్‌లో రెండు చేతులూ పైకెత్తి, కాళ్లు రెండూ దూరంగా పెట్టి, ఫేస్‌లో సెక్సీ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. వేదిక వెండితెరకు కొత్త కాదు.
అప్పుడెప్పుడో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. 'బాణం', 'దగ్గరగా దూరంగా' తదితర చిత్రాల్లో నటించింది. మధ్యలో అవకాశాల్లేక కాస్త గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్‌లో కన్నడ, తమిళ తదితర భాషల్లో బిజీగా ఉంది. తాజాగా లారెన్స్ పుణ్యమా అని, మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. 'కాంచన 3' హిట్‌తో బాలయ్య దృష్టిలో పడింది. బాలయ్య తాజా చిత్రంలో వేదిక ఓ హీరోయిన్గా నటిస్తోంది. కె.ఎస్.రామారావు ఈ సినిమాకి దర్శకుడు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.