టాక్ అఫ్ ది వీక్ – వీర భోగ వసంత రాయలు

మరిన్ని వార్తలు

ఈమధ్యకాలంలో ఇద్దరు, ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమా చేయడం అదే మల్టీస్టారర్ ట్రెండ్ తెలుగు పరిశ్రమలో హల్చల్ చేస్తున్నది. అందులో భాగంగానే తాజాగా  నారా రోహిత్, సుధీర్ బాబు & శ్రీవిష్ణుల కలిసి చేసిన చిత్రమే వీర భోగ వసంత రాయలు.

ఈ ముగ్గురు కలిసి చేస్తున్నారు అనగానే ఈ సినిమా పైన అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా విడుదలకి దగ్గరకి రాగానే ఈ సినిమా తాలుకా ప్రీమియర్స్ అమెరికాలో వేయడం అక్కడ ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం, ఇక్కడ సైతం ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ఈ సినిమా పైన అంచనాలు పటాపంచలు అయిపోయాయి.

ఇంతకి ఈ సినిమా కథ విషయానికి వస్తే, రెండు మూడు పొరలు ఉన్న కథని సిద్ధం చేసుకున్న దర్శకుడు దానిని ప్రేక్షకులకి అందించే విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. వీర భోగ వసంత రాయలు పాత్ర ఆశయం, లక్ష్యం ఏమిటో అనేది క్లైమాక్స్ వరకు దాయడం అనేది కాస్త ఇబ్బందిగా మారింది.

అదే సమయంలో కథనంలో చాలా లోపాలు ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇదంతా కాకుండా సుధీర్ బాబు తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోకపోవడం కొసమెరుపు.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS