VSR: డైనమైట్లు లా పేలిన వీరసింహా డైలాగులు ఇవే

మరిన్ని వార్తలు

వీరసింహారెడ్డిలో డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్ లో బాలయ్య పలిగిన డైలాగులని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ‘‘ఏది అభివృద్ధి హోం మినిస్టర్‌.. ప్రగ‌తి సాధించ‌డం అభివృద్ధి.. ప్రజ‌ల్ని వేధించ‌డం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమెయ్యడం కాదు. ప‌ని చెయ్యడం అభివృద్ధి.. ప‌నులు ఆప‌డం కాదు. నిర్మించ‌డం అభివృద్ధి.. కూల్చడం కాదు. ప‌రిశ్రమ‌లు తీసుకురావ‌డం అభివృద్ధి.. ఉన్న ప‌రిశ్రమ‌లు మూయ‌డం కాదు. బుద్ధి తెచ్చుకో.. అభివృద్ధికి అర్థం తెలుసుకో’’ అని రాజకీయాల మీద బాలయ్య పేల్చిన డైలాగు ఆటంబాంబ్ లా పేలింది. 

 

‘దేశానికి రాష్ట్రప‌తినిచ్చింది రాయ‌ల‌సీమ‌. అవిభ‌క్త ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రుల్ని ఇచ్చింది రాయ‌ల‌సీమ‌. తెలుగు జాతి ఆత్మగౌర‌వం కోసం పిడికిలెత్తిన మ‌హ‌నీయుడ్ని గుండెల్లో పెట్టుకుంది రాయ‌ల‌సీమ‌. ఇది రాయ‌ల్‌ సీమ‌. గ‌జ‌రాజులు న‌డిచిన దారిలో గ‌జ్జి కుక్కలు కూడా న‌డుస్తుంటాయి. రాజును చూడు.. కుక్కను కాదు..’’అంటూ సీమ గురించి చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. 

 

మరికొన్ని డైనమైట్లు : 

 

‘‘అన్నం మీద గౌరవం లేని వాడు ఆకలికి పనికిరాడు.. అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికి రాడు’’ 

 

‘‘కోసేవాడికి కోడి మీద పగ ఉండదు.. నేనూ అంతే. చాలా పద్ధతిగా నరుకుతా’’

 

‘‘సెంట్రల్ అయినా.. స్టేట్ అయినా.. రాజకీయాల మీద బతికే మనిషిని కాదు.. రాజకీయాల్ని మార్చే మనిషిని’’

 

 ‘‘నన్ను తట్టుకొని నిలవాలంటే మూడే దారులు. మారిపోవాలి.. పారిపోవాలి.. లేదంటే సచ్చిపోవాలి’’

 

‘‘నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా’’

 

‘‘నేనెవరో చెప్పే అలవాటు నాకు లేదు. జీవోను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తా. నీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌’’

 

‘‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు’’

 

‘‘పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్‌ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ’’

 

''మూతి మీదమోలిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా'

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS