వీరసింహారెడ్డికి దాదాపు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. పరమ రొటీన్ సినిమా ని చాలా మంది విమర్శించారు. కేవలం ఎలివేషన్స్ ని నమ్ముకొని సినిమా తీశారని ఎత్తిచూపారు. అయితే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఇది బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన మూవీ అని ప్రకటించాయి. దీనికి వీరమాస్ బ్లాక్ బస్టర్ అంటూ పేరు పెట్టారు.
''వీరసింహా అన్ని చోట్ల రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ఫస్ట్ డే 50 కోట్ల గ్రాస్ దాటుతోంది. ఇది పెద్ద రికార్డ్. నైజం, సీడెడ్ , ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర ప్రతి చోట అద్భుతమైన కలెక్షన్స్ చేస్తోంది. యూఎస్ లో 708k గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది బాలకృష్ణ గారి ఆల్ టైం రికార్డ్. ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు, అభిమానులు బాలకృష్ణ గారి విశ్వరూపం చూశామని అభినందిస్తున్నారు. బాలకృష్ణ గారితో ఎప్పటి నుండో సినిమా చేయాలని అనుకుంటున్నాం. సినిమాతో ఆ కల నేలవేరింది. బాలకృష్ణ గారి కెరీర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని మాకు ఇచ్చినందుకు ఆనందంగా వుందని సంతోషపడిపోతున్నారు నిర్మాతలు.