దర్శకుడు తేజ సంకట స్థితిలో పడ్డాడు. ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. ఓవైపు వెంకటేష్‌తో సినిమా ఓకే అయ్యింది. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్యతో తీసే ఛాన్స్ దక్కింది. అయితే ఈ రెండు సినిమాల్లో ఒకటే టేకాఫ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బాలయ్యనా? వెంకటేష్ నా? అనే సందిగ్థంలో ఆయన బాలయ్య వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. వెంకటేష్ సినిమాని ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారని తెలుస్తోంది.
'నేనే రాజు నేనే మంత్రి ` తరవాత వెంకటేష్ - తేజ కాంబో ఓకే అయ్యింది. ఈసినిమా క్లాప్ కూడా కొట్టుకుంది. అయితే... ఎన్టీఆర్ చిత్రాన్ని దసరా నాటికి రిలీజ్ చేయాలని బాలకృష్ణ డెడ్ లైన్ పెట్టాడట. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో వెంకటేష్ సినిమాని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. మరి తేజ స్థానంలో మరో దర్శకుడ్ని తీసుకుంటారా? లేదంటే.. ఈ కథని వెంకీ కూడా వదిలేస్తారా? అనేది తెలియాల్సివుంది.