తమిళనాట ఘన విజయం సాధించిన `అసురన్`ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. `వెంకీ మామా` తరవాత.. వెంకటేష్ నటించబోయే సినిమాఇదే. దర్శకుడిగా చాలామంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఓ దశలో ఓంకార్ కి ఈ అవకాశం వస్తుందనుకున్నారు. అయితే.. అనూహ్యంగా హను రాఘవపూడి ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది.
అందాల రాక్షసి, కృష్ణగాడివీర ప్రేమగాథలతో మంచి విజయాల్ని అందుకున్నాడు హను. అయితే ఆ తరవాత వచ్చిన లై, పడి పడి లేచె మనసు ఫ్లాపులయ్యాయి. ఈ దశలో వెంకీ సినిమా ఛాన్స్ రావడం గొప్ప విషయమే. ఈనెలలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.