'నారప్ప'కే ఫిక్సయిన 'వెంకీ మామ'.!

మరిన్ని వార్తలు

రీమేక్‌ల స్పెషలిస్ట్‌ అయిన వెంకీ తాజాగా ఓ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న 'అసురన్‌' మూవీ తెలుగులో వెంకటేష్‌ హీరోగా తెరకెక్కుతోంది. క్లాసిక్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాకి దర్శకుడు. తమిళంలో ధనుష్‌ నటించిన పాత్రలో వెంకీ కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకి 'నారప్ప' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేస్తూ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. ఈ లుక్‌కీ, టైటిల్‌కీ మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

 

ఇలాంటి పాత్రలు వెంకీకి అస్సలు కొత్తేం కాదు. అయితే, ఒరిజినల్‌లో యంగ్‌ హీరో అయిన ధనుష్‌ నటించిన పాత్రలో కాస్త ఏజ్డ్‌ అయిన వెంకీ కనిపిస్తుండడం ఈ రీమేక్‌ స్పెషాలిటీ. ఇకపోతే, 'నారప్ప' టైటిల్‌కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే, ఈ సినిమాతో మరో హిట్‌ వెంకీ ఖాతాలో పడుతుందనిపిస్తుంది. వెంకీ కెరీర్‌ బెస్ట్‌ క్యారెక్టర్స్‌లో ఈ 'నారప్ప' కూడా చేరుతుందని ఫ్యాన్స్‌ అంచనా వేస్తున్నారు. గతంలో 'జయం మనదేరా' తదితర చిత్రాల్లో వెంకీ ఈ తరహా పాత్రల్లో కనిపించి మెప్పు పొందాడు. చాలా కాలం తర్వాత మళ్లీ ఆ తరహా పాత్రలో వెంకీ కనిపించబోతున్నాడు.

 

వెంకీ ఓన్‌ బ్యానర్‌ అయిన సురేష్‌ ప్రొడక్షన్స్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్‌ చేసి, సమ్మర్‌ రిలీజ్‌కి ఈ సినిమాని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS