వెంకీ మామ సినిమాలకు బ్రేకిచ్చేస్తారా.?

మరిన్ని వార్తలు

వెంకీ కామెడీ టైమింగ్‌ని మ్యాచ్‌ చేయడం చాలా కష్టమని అల్లుడు నాగచైతన్య కితాబిచ్చాడు. కానీ, ఆ మాట వెంకీ ఫ్యాన్స్‌ ఎవరినడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఏజ్‌ పెరిగినా, ఆయనలోని కామెడీ క్రేజ్‌ ఎంత మాత్రమూ తగ్గలేదు. అదే హుషారు, అదే దూకుడు, అదే జోరు. అయ్యో.. అయ్యో.. అయ్యో..' ఇలాంటి కొన్ని స్పెషల్‌ సైన్స్‌ వెంకీకే సాథ్యం. ఇకపోతే, ఒకానొక టైమ్‌లో వెంకటేష్‌ సినిమాలకు బ్రేకిచ్చేయాలనుకున్నారట. కానీ, ఫ్యాన్స్‌ ఆయన్ని వదిలి పెట్టనే లేదంటున్నారు. ఈ ఏడాది స్టార్టింగ్‌లో 'ఎఫ్‌ 2' చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టేశాడు.

 

ఇక ఇప్పుడు రియల్‌ లైఫ్‌ మేనల్లుడితో 'వెంకీ మామ' అంటూ వచ్చి ధియేటర్స్‌లో సందడి చేస్తున్నాడు. ఇవే కాదు, మరిన్ని మల్టీ స్టారర్‌ మూవీస్‌లో నటించాలనుందంటున్నాడు. ఎన్టీఆర్‌, నాని తదితర హీరోలతో మల్టీ స్టారర్స్‌ చేయాలన్న వెంకీ మనసులోని కోరిక బయట పెట్టాడు. అంతేకాదండోయ్‌.. మంచి స్క్రిప్టులతో వస్తే, వెబ్‌ సిరీస్‌లో కూడా నటించేందుకు తాను సిద్ధమే అని సంకేతాలిస్తున్నాడు వెంకీ. ప్రస్తుతం ఆయన చేతిలో చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. ఈ లోగా ఆయన కోరుకున్నట్లుగా ఎన్టీఆర్‌, నాని వంటి హీరోలతో మల్టీ స్టారర్‌ కాన్సెప్ట్‌లు కూడా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అంటే ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఆలోచన వెంకీ పక్కన పెట్టేయ్యాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS