'గోపాలా గోపాలా' చిత్రంలో విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. భారీ మల్టీ స్టారర్ చిత్రమిది. ఈ చిత్రం ఓ ఏడాది సంక్రాంతికే విడుదలైంది. ఆ సంక్రాంతికి ఈ సినిమా మంచి విజయం అందుకుంది. తాజాగా వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'అజ్ఞాతవాసి'లో గెస్ట్ రోల్‌లో నటించాడు. అయితే ఆల్రెడీ 'అజ్ఞాతవాసి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమాలో వెంకటేష్ నటించిన సీన్స్ మాత్రం లేవు. ఈ సీన్స్‌ని సంక్రాంతి నుండి 'అజ్ఞాతవాసి'లో యాడ్ చేయనున్నారట.
ఈ విషయాన్ని తెలియజేస్తూ, వెంకీ, పవన్ డబ్బింగ్ చెబుతున్న మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోకి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోతోంది. 'గురువుగారూ గురువుగారూ..' అంటూ పవన్ కళ్యాణ్, వెంకీని పిలుస్తుంటే, 'గారు ఎందుకు..గురు అంటే చాలు..' అని వెంకీ అంటున్నారు ఈ వీడియోలో. ఈ వీడియో చూసేందుకు చాలా ఫన్నీగా అనిపిస్తోంది. అయితే ఇది ఓన్లీ మేకింగ్ వీడియోనే. సినిమాలో ఈ సీన్స్‌ని సంక్రాంతి నుండి యాడ్ చేయనున్నారట. దాంతో 'అజ్ఞాతవాసి'కి సంక్రాంతి నుండి సరికొత్త ఫ్లేవర్ యాడ్ అవనుందన్న మాటే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్‌గా ఉన్నప్పుడు వెంకటేష్ నటించిన 'మల్లీశ్వరీ' చిత్రానికి డైలాగ్స్ రాశాడు. వెంకీ నోట, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు ఎంత బాగా పేలాయో ఆ సినిమాలో అందరికీ తెలిసిందే. డైరెక్టర్‌గా మారాక, ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి'లో వెంకీ కోసం ఎలాంటి పంచ్ డైలాగులు త్రివిక్రమ్ సిద్ధం చేశాడో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే మరి.