ఓటీటీకే నార‌ప్ప ఓటు... 20న రిలీజ్‌!

మరిన్ని వార్తలు

వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `నార‌ప్ప‌`. ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ధారి. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ లో ఈనెల 20న ఈ సినిమా నేరుగా విడుద‌ల అవుతోంది. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన అసుర‌న్ కి ఇది రీమేక్‌. ఈ సినిమా ఓటీటీ బేరం ఎప్పుడో ఫిక్స‌యిపోయింది. అయితే.. ఇటీవ‌ల ఎగ్జిబీట‌ర్లు, బ‌య్య‌ర్లు సినిమాల్ని ఓటీటీకి ఇవ్వొద్ద‌ని నిర్మాత‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. వెంక‌టేష్ కూడా ఈ సినిమాని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఓటీటీ తో చేసుకున్న ఒప్పందం ర‌ద్దు చేసుకుంటార‌ని వార్త‌లు వినిపించాయి.

 

అయితే... చిత్ర‌బృందం ఓటీటీకే మొగ్గు చూపించింది. సెకండ్ వేవ్ ఉధృతి త‌గ్గి, థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు ఇచ్చినా.. నిర్మాత‌లెందుకో జంకుతున్నారు. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రార‌న్న‌ది వాళ్ల భ‌యం. కుటుంబ ప్రేక్ష‌కుల‌లు థియేట‌ర్ల‌కు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని, అంత వ‌ర‌కూ త‌మ సినిమాల్ని విడుద‌ల చేసుకోకుండా ఆప‌డం చాలా క‌ష్ట‌మ‌ని, అందుకే ఓటీటీల బాట ప‌డుతున్నామ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. మ‌రో వారం ప‌ది రోజుల్లో మ‌రిన్ని కొత్త సినిమాలు ఓటీటీలోకి వెళ్ల‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. వాటికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లు కూడా త్వ‌ర‌లోనే వ‌చ్చే ఛాన్సుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS