తమిళంలో విజవంతమైన చిత్రం `అసురన్`. ఇప్పుడు తెలుగులో `నారప్ప`గా రీమేక్ అయ్యింది. వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రధారులు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈనెల 20న అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు.
``మన దగ్గర భూముంటే తీసేసుకుంటారు డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ... చదువునొక్కదాన్ని మాత్రం మన దగ్గర్నుంచి ఎవరూ తీసుకోలేరు`` అనే వెంకీ డైలాగ్ ఈ ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. అణగారిన వర్గాలకు ప్రతినిధిగా.. వెంకీ ఈ సినిఆమలో కనిపించబోతున్నాడు. ఓ కుటుంబానికిజరిగిన అన్యాయంపై.. కథానాయకుడు ప్రతీకారం తీర్చుకోవడమే `నారప్ప` కథ. అదంతా.. ట్రైలర్లోనే చెప్పేశారు. నారప్ప పాత్రలో వెంకీ విశ్వరూపం చూపించాడు. తనదైన ఎమోషన్ ని పక్కాగా పలికించాడు. ఓరకంగా చెప్పాలంటే.. తమిళంలో ధనుష్ చేసిన పాత్రకు 200 శాతం న్యాయం చేశాడనిపిస్తోంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్టిస్టుల ప్రతిభలోనూ కథ తాలుకా... డార్క్‌నెస్ కనిపిస్తోంది. ``రా.. నరకరా.. నరకరా... ఎదురు తిరిగి కసిగ రా.. నరకరా.. తలలు ఎగసి పడగ...`` అంటూ సాగే పాటలో.. వెంకీ ప్రతీకారం తీర్చుకోవడం కనిపిస్తోంది.
నిజానికి ఈ సినిమా ఓటీటీ కోసం అని ఎప్పుడో ఫిక్సయ్యింది. అయితే... థియేటర్ యజమానుల అభ్యర్థనతో.. ఓటీటీ నుంచి థియేటర్ రిలీజ్ కి వస్తుందునుకున్నారు. కానీ.. మళ్లీ ఓటీటీ బాటే పట్టింది. మరి.. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు రంజింపచేస్తుందో చూడాలి.