వెంకీ రెడీ అయ్యాడు.. 'నార‌ప్ప' స్టార్ట్ అయ్యేది అప్పుడే!

మరిన్ని వార్తలు

అక్టోబ‌రు నుంచి పెద్ద సినిమాల షూటింగులు మొద‌ల‌వుతాయ‌నుకున్న‌వాళ్ల‌కు నిరాశే ఎదురైంది. బ‌డా హీరోలంతా.. షూటింగుల‌కు `నో` చెప్ప‌డంతో, టాలీవుడ్ కి అస‌లైన హుషారు రాలేదు. పెద్ద సినిమాల‌న్నీ వెన‌క్కి వెళ్లిపోతున్నాయి. `నార‌ప్ప‌`దీ అదే ప‌రిస్థితి. అక్టోబ‌రులో ఈసినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంద‌నుకున్నారు. కానీ అది సాధ్య ప‌డ‌లేదు.

 

ఎట్ట‌కేల‌కు వెంకీ `నార‌ప్ప‌` షూటింగ్ కి రెడీ అయ్యాడ‌ని స‌మాచారం. వ‌చ్చే నెల 5 నుంచి `నార‌ప్ప‌` కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్న‌ద‌ట‌. ఈసారి వెంకీ 5 రోజుల పాటు షూటింగులో పాల్గొంటాడ‌ని తెలుస్తోంది. దాంతో ఈ షెడ్యూల్‌కి సంబంధించిన షూటింట్ పూర్త‌వుతుంది. `నార‌ప్ప‌` పూర్త‌యితే గానీ వెంకీ త‌న కొత్త సినిమా `ఎఫ్ 3` మొద‌లెట్ట‌డానికి లేదు. అందుకే.. `నార్ప‌ని` అర్జెంటుగా ఫినిష్ చేయాల‌ని వెంకీ భావిస్తున్నాడు. ఈ సంక్రాంతికి `ఎఫ్ 3` మొద‌లుకానుంది. ఈలోగా.. `నారప్ప‌` పూర్త‌యిపోతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS