ఈ మధ్య వెంకటేష్ కథలను ఎంచుకోవడంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ కోణంలో కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ చూడని స్లో ఫేజ్ కనిపించింది. దాన్ని కవర్ చేసేందుకు వెంకీ రంగం సిద్ధం చేశాడట. వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడనీ తెలుస్తోంది.
ప్రస్తుతం ఐదారు సినిమాల వరకూ వెంకీ చేతిలో ఉన్నాయనీ తెలుస్తోంది. వీటిలో మూడు సినిమాలను తన సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్‌లోనే రూపొందనున్నాయట. మరో రెండు మూడు సినిమాలు ఇతర బ్యానర్స్‌లో రూపొందనున్నాయట. వరుణ్‌తేజ్‌తో వెంకీ చేస్తున్న 'ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ సినిమాలో వెంకీ సరసన తొలిసారిగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు మేనల్లుడు నాగచైతన్యతోనూ ఓ మల్టీ స్టారర్‌లో నటించనున్నాడు వెంకీ. ఈ సినిమాకి 'వెంకీ మామా' టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఈ రెండూ కాక వెంకీ సోలో హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇలా ఈ ఏడాది చివరికల్లా వెంకీ నుండి రెండు సినిమాలు వచ్చే అవకాశాలున్నాయనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. 2
019లో మూడు నుండి నాలుగు సినిమాల వరకూ విడుదల కానున్నాయనీ తెలుస్తోంది. అగ్రహీరోల్లో తన తోటి హీరోలైన బాలయ్య, నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ వరుసలో వెంకీ వెనకబడి ఉన్నాడు. అందుకే ఇకపై వెంకీ కూడా జోరు పెంచనున్నాడట.