వెంకటేష్ కూతురి పెళ్లి

మరిన్ని వార్తలు

టాలీవుడ్ వరస పెళ్లిళ్లతో కళ కళ లాడుతోంది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వరుణ్  తేజ్, లావణ్య ల పెళ్లి జరిగింది. ఈ ఇయర్ దిల్ రాజ్ సోదురుడు కొడుకు యంగ్ హీరో  ఆశిష్ రెడ్డి వివాహం జరిగింది. లేటెస్ట్ గా కిరణ్ అబ్బవరం యంగేజ్ మెంట్ అయ్యింది. ఇప్పడు స్టార్ హీరో వెంకటేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కిందట ఏడాది రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి జరిగింది. సంవత్సరం తిరగకుండానే మళ్ళీ దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది.


వెంకేటేష్ తన రెండవ కుమార్తె 'హయవాహినిని'  విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ లో వీరి నిశ్చితార్ధం జరిగింది. నేడు పెళ్లి జరగనుంది. హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియో ఈ వేడుకకి వేదిక కానుంది. కేవలం కుటుంబసభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్ళికి అటెండ్ అవుతున్నట్టు సమాచారం. ఆల్రెడీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. నిన్న నైట్ మెహందీ, సంగీత్  వేడుక జరిగింది. ఈ వేడుకకి సంబంధించిన ఫొటోస్ నెట్ లో వైరలవుతున్నాయి. మెహందీ ఫంక్షన్ కి మహేష్ భార్య నమ్రత, కూతురు సితార అటెండ్ అయ్యారు. వీరి పిక్స్ ప్రజంట్ సొషల్మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS