'వెంకీ మామ' ఫ్యామిలీని చూశారా!

మరిన్ని వార్తలు

ఈ దసరా పండక్కి ఫుల్‌ జోష్‌తో వచ్చేశాడు 'వెంకీ మామ'. ఒక్కడే కాదు, ఏకంగా ఫ్యామిలీతో వచ్చేశాడు. రైలెక్కి, బస్సెక్కి, కారెక్కి కాదు, ట్రాక్టరేసుకుని వచ్చి పండగ పూటా ఫ్యాన్స్‌కి సూపర్బ్‌ కిక్‌ ఇచ్చాడు. విక్టరీ వెంకటేష్‌, నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'వెంకీ మామ'. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేపు అనగా దసరాకి 'వెంకీ మామ' ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేయనుంది చిత్రయూనిట్‌. ఈ విషయాన్ని ప్రకటిస్తూ, చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ విడుదల చేసింది.

 

ఆ పోస్టర్‌లోనే వెంకీ మామ అండ్‌ ఫ్యామిలీ సందడిగా కనిపించారు. నాగ చైతన్య, రాశీఖన్నా బబ్లీగా కనిపిస్తుండగా, పాయల్‌ రాజ్‌పుత్‌ తన క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చాలా హుందా అయిన లుక్స్‌లో కనిపిస్తోంది. వెంకటేష్‌ యాజ్‌ యూజ్‌వల్‌ ఫ్యామిలీ హీరో లుక్స్‌లో కేక పుట్టిస్తున్నాడు. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టి.జి.విశ్వ ప్రసాద్‌తో కలిసి, సురేష్‌ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న 'వెంకీ మామ' త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS