అనాథ పిల్లల కోసం పెద్ద మనసు చాటుకున్న 'వెంకీ మామ'

మరిన్ని వార్తలు

'వెంకీ మామ' నాగచైతన్యకే కాదు, అందరికీ మామయిపోయాడు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వెంకీ మామ' సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. టైటిల్‌ క్యాచీగా ఉండడంతో, ఇప్పుడంతా వెంకీని 'వెంకీ మామ' అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న వెంకీ మామ తన సంతోషాన్ని అనాధ పిల్లలతో పంచుకున్నారు. అనాధ పిల్లల కోసం 'వెంకీ మామ' స్పెషల్‌ షో వేయించారు. పిల్లలతో కలిసి వెంకీ మామ కూడా తన సినిమాని తిలకించారు.

 

ఈ సందర్భంగా పిల్లల్ని చూసి వెంకీ మామ చాలా ఎగ్జైట్‌ అయ్యారు. అలాగే వెంకీని చూసిన పిల్లలు సంతోషంతో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే అనాధ పిల్లల కోసం వెంకీ కొన్ని బహుమతులు కూడా తీసుకెళ్లి వారికి సంతోషాన్ని పంచిపెట్టారు. ఈ ఏడాది రెండు సినిమాలతో వెంకీ సందడి చేశారు. ఏడాది మొదట్లో 'ఎఫ్‌ 2'తో హిట్‌ బోనీ కొట్టిన వెంకీ, వెంకీ మామ'తో మరో సూపర్‌ హిట్‌ కొట్టి, ఈ ఏడాదికి శుభం కార్డు వేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన 'వెంకీ మామ' సినిమాలో రియల్‌ లైప్‌ మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటించారు వెంకీ. తనతో పాటు మేనల్లుడు చైతూకీ ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ ఇచ్చాడు. పాయల్‌ రాజ్‌ పుత్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సక్సెస్‌ ఫుల్‌ రన్‌ రేట్‌తో ఇంకా ధియేటర్స్‌లో రన్‌ అవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS