ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే 'కథానాయకుడు', 'మహానాయకుడు' అంటూ స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌తో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ బయోపిక్ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ, విద్యాబాలన్ నటనకు తెలుగు ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. ఆమెను బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా హిట్ అయ్యి ఉంటే, ఆ ఇంపాక్ట్ మరోలా ఉండేది. తదుపరి సమంత, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన 'మజిలీ' సినిమాతో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా పరిచయమైంది.
సినిమాకి పోజిటివ్ టాక్ రావడంతో పాటు, ఈ కొత్త భామ నటనకు కూడా మంచి మార్కులే వేశారు మన ఆడియన్స్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన 'జెర్సీ'తో కన్నడ భామ శ్రద్ధా శ్రీనాధ్ పరిచయమైంది. 'నన్ను గుర్తు పెట్టుకోండి.. నా పేరు శ్రదా ్ధశ్రీనాధ్' అంటూ సినిమా విడుదలకు ముందే ఈ భామ కాస్త ఎక్కువే హడావిడి చేసింది. హడావిడికి తగ్గట్లే యాక్టింగ్‌లో నూటికి నూరు మార్కులు వేయించుకుంది. నానితో పాటు, ఫస్ట్ హిట్‌ని తన ఖాతాలోనూ జమ చేసుకుంది.
ఆ తర్వాత 'సాహో'తో బాలీవుడ్ నుండి అందాల భామ శ్రద్ధా కపూర్ సౌత్ ప్రేక్షకుల్ని పలకరించింది. కానీ, 'సాహో' రిజల్ట్ తెలిసిందే కదా.. దాంతో శ్రద్ధాని పెద్దగా పట్టించుకోలేదు. 'గద్దలకొండ గణేష్'తో మృణాళిని రవి, 'హిప్పీ'తో దిగంగనా సూర్యవన్షీ తదితర ముద్దుగుమ్మలు ఈ ఏడాది డెబ్యూ చేసి, తెలుగు ప్రేక్షకుల్ని తమ అందాలతో, అందమైన నటనతో ఆకట్టుకున్నారు.