చిరంజీవి ఫేవరేట్ సినిమాల్లో 'చంటబ్బాయ్' ఒకటి. ఆ క్యారెక్టరైజేషన్ లో గమ్మత్తు వుంటుంది. జనరేషన్స్ మారుతున్న అది ఫ్రెష్ గానే కనిపిస్తుంది. ఇప్పుడు అదే సినిమా స్ఫూర్తితో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో 'చారి 111' అనే సినిమా వస్తోంది. ఇది 'చంటబ్బాయ్'కి ఫ్రీమేక్ లా వుంటుందని తెలుస్తుంది.
సుమంత్ హీరోగా వచ్చిన 'మళ్ళీ మొదలైంది' చిత్రాన్ని తీసిన కీర్తి కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. ఇందులో కిశోర్ గూఢచారి పాత్రలో కనిపిస్తాడు. 'చంటబ్బాయ్'టైపులో సరదా స్పై. వెన్నెల కిషోర్ మాంచి టైమింగ్ వున్న ఆర్టిస్ట్. ఈమధ్య కామెడీ రోల్స్ కే పరిమితమైపోయాడు. చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం మళ్ళీ లీడ్ రోల్ చేస్తున్నాడు. నవ్వించే డిటెక్టివ్ సినిమా వచ్చి చాలా కాలమైయింది. మరి ఈ సినిమాతో ఆ లోటు తీరుస్తారేమో చూడాలి.