కరోనా ఎఫెక్ట్‌: చీపురు పట్టిన కామెడీ కింగ్‌!

మరిన్ని వార్తలు

సినిమాల్లో కామెడీ కింగ్‌.. నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా.! ఆయనే వెన్నెల కిషోర్‌. వెన్నెల కిషోర్‌ కోసం ప్రత్యేకంగా ఓ ట్రాక్‌ రాసి, సినిమాలో ఆ ట్రాక్‌నే హైలైట్‌గా చిత్రీకరించే దర్శకులు చాలామందే వున్నారు. హీరోలతో సమానంగా స్క్రీన్‌ స్పేస్‌ దక్కించుకోవడమే కాదు, తన కామెడీతో ది¸యేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించగలిగే కామెడీ కింగ్‌ ఆయన. అలాంటి వెన్నెల కిషోర్‌, చీపురు పట్టుకుని ఇళ్ళు ఊడ్చడమేంటి.? అంతా కరోనా ఎఫెక్ట్‌. కరోనా దెబ్బకి అందరూ తమ తమ ఇళ్ళకే పరిమితమవ్వాల్సి వస్తోంది. నిత్యం సినిమా షూటింగులతో బిజీగా వుండే సెలబ్రిటీలు, ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఇంట్లో టైవ్‌ుపాస్‌ చేయడం చాలా కష్టంగా మారిపోయి.. ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నారు.

 

‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే..’ అన్నట్టుగా వెన్నెల కిషోర్‌ చీపురు పట్టుకుని ఇళ్ళు ఊడ్చేస్తోంటే, అది చూసి చాలామంది అభిమానులూ ఇన్‌స్పైర్‌ అవుతున్నారు. అవును, మనింట్లో పని మనం చేసుకుంటే తప్పేముంది.? పైగా, కరోనా దెబ్బకి పని మనుషులు కూడా దొరకడంలేదాయె. దీన్ని కష్టం అనుకోకూడదు, ఇష్టంగానే భావించాలేమో. అంతే మరి, వేరే దారి లేనప్పుడు కష్టాన్ని ఇష్టంగా చేసుకోక తప్పదు. బోల్డంతమంది సెలబ్రిటీలు, రకరకాల మార్గాల్లో టైవ్‌ు పాస్‌ చేస్తోంటే, వారి అభిమానులూ సోషల్‌ మీడియాలో ఇవన్నీ చూసి పండగ చేసుకుంటున్నారు.. తమ ఇళ్ళల్లోనే సుమీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS