కంబైండ్ ఛాటింగ్. అది కూడా నలుగురు సెలబ్రిటీస్ మధ్య. ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యేంతగా. ఎవరనుకుంటున్నారా ఆ నలుగురు. ముద్దుగుమ్మ సమంత, హీరో రాహుల్ రవీంద్ర, అడవి శేష్, ఇంకా నవ్వుల రారాజు వెన్నెల కిషోర్. ఈ నలుగురూ సరదాగా సోషల్ మీడియాలో ఛాటింగ్ చేసుకున్నారు. వెన్నెల కిషోర్‌కి గాయని, రాహుల్ రవీంద్ర సతీమణి అయిన చిన్మయి సరదాగా ఫేస్ ఫ్యాక్ వేసింది. ఆ టైంలో రాహుల్ రవీంద్ర, అడవిశేష్, ఫేస్ ప్యాక్‌తో ఉన్న వెన్నెల కిషోర్‌తో ఫోటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ, నటుడు అడవిశేష్ 'బ్యూటీ క్వీన్‌తో నేను రాహుల్' అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఆ ట్వీట్‌కి రాహుల్ స్పందించి నా వైఫ్ వేసిన ఫేస్ ప్యాక్‌తో వెన్నెల కిషోర్ చాలా అందంగా తయారవుతాడని చెప్పగలను.. అంటూ టౌన్‌లోకి కొత్తబ్బాయి రాబోతున్నాడు జాగ్రత్త' అంటూ రీ ట్వీట్ చేశారు. దీని తర్వాత వెన్నెల కిషోర్ 'చందమామలాంటి అందమైన ముఖం' అనే అర్ధం వచ్చేలా ఓ హిందీ పాటను ట్విట్టర్‌లో రాసి, ఫేస్ ప్యాక్ తర్వాత ఆయన ముఖాన్ని సెల్ఫీలో బంధించి పోస్ట్ చేశారు. అలాగే ఇంత అందంగా తనకి ఫేస్ ప్యాక్ చేసిన చిన్మయికి థాంక్స్ కూడా చెప్పాడు వెన్నెల కిషోర్. సమంతకి తెర వెనుక వాయిస్ ఇచ్చేది చిన్మయినే. ఈ ముగ్గురి సంభాషణలకి మన ముద్దుగుమ్మ సమంత ఓ సరదా ట్వీట్ చేశారు. 'వావ్ నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. ఐ బ్రోస్ షేప్ చేశావా? కొంచెం లిప్‌స్టిక్ కూడా వేసినట్లున్నావ్..' అని. అందుకు అవును సమంత 'అక్టోబర్‌కి రెడీ అవుతున్నా..' అంటూ సమంతకి వెన్నెల కిషోర్ రిప్లై ఇచ్చాడు. ఇలా సోషల్ మీడియాలో ఈ ఫన్నీ కాన్‌వర్‌జేషన్ భలే సరదాగా సాగింది.