ధియేటర్ లలో జాతీయ గీతం తప్పనిసరి అని కొద్ది కాలం క్రిందట సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చిన వేళ కొద్దిగా వాడి వేడి చర్చ జరిగిన సంగతి వాస్తవమే.
ఇక ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ధియేటర్ లలో జాతీయ గీతం తప్పనిసరి అనే దానిని పునఃసమీక్షించాలని కోరడం ఆ విన్నపాన్ని సమీక్షించిన తరువాత వారు గతంలో ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే అసలు ఎటువంటి పరిస్థితుల్లో జాతీయ గీతాన్ని ఆలపించాలి అనే దానిపైన మార్గదర్శకాలు రూపొందించడానికి ఒక కేబినేట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు కోర్టుకి తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
దీనితో ఇక నుండి ధియేటర్ లలో జాతీయ గీతం అనేది కచ్చితం కాదు అని తేలిపోయింది. ఇక ఈ తీర్పు వెలువడిన సమయం నుండి ఇదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. మరి ఈ తీర్పు ఎన్నాళ్ళు కొనసాగనుందో అనేది వేచి చూడాలి.
ఇక అజ్ఞాతవాసి, జై సింహ చిత్రాలు చూడటానికి ధియేటర్ కి వెళ్ళే ప్రేక్షకులకి జాతీయ గీతం బహుశా వినిపించకపోవచ్చు.