విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'బేగమ్ జాన్'. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్‌తో విద్యా బాలన్ హీటెక్కించేస్తోంది. ఈ సినిమాలో విద్యా బాలన్ ఓ వేశ్యా గృహ నిర్వాహకురాలి పాత్రలో నటిస్తోంది. పోస్టర్ చూసి ఇదేదో 'డర్టీ పిక్చర్' నేపధ్యం ఉన్న సినిమా అనుకున్నారంతా. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసినాక తమ తమ అభిప్రాయాలను మార్చుకోవడం తమ వంతైంది. ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ అలాంటిది మరి. ఏకంగా ఈ సినిమాలో విద్యా బాలన్ అమ్మాయిలతో పోరాటాలు చేయిస్తోంది. చాలా పవర్ ఫుల్‌గా ఉంది ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్. వాయిస్, బాడీ లాంగ్వేజ్ అంతా చాలా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అందుకే ఈ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. యూ ట్యూబ్‌లో సంచలనాలకు తెర తీస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 50 లక్షల వ్యూస్‌ని క్రాస్ చేసేసింది. గంట గంటకీ ఈ వ్యూస్ పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది ఈ ట్రైలర్. అద్భుతంగా ఉంది ట్రైలర్ చూస్తుంటే, తొలి పోస్టర్‌తోనే మై వరల్డ్, మై కంట్రీ, మై హౌస్, మై బాడీ అంటూ చేతిలో హుక్కాతో మత్తెక్కించే చూపులతో చాలా హాట్‌గా, ధీటుగా కనిపించిన విద్యా బాలన్ ట్రైలర్‌తో అదరగొట్టేస్తోంది. ట్రైలర్ చూశాక ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.