బసవతారకంగా ఇటీవల 'ఎన్టీఆర్' బయోపిక్‌తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ భామ విద్యాబాలన్. సినిమా విజయవంతం కాలేదు. కానీ, బసవతారకం పాత్రలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది విద్యాబాలన్. ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయి నటించి మెప్పించింది. నిజంగానే ఎన్టీఆర్ భార్య బసవతారకం ఇలాగే ఉంటుందా.. అనిపించేలా ఆ పాత్రకు జీవం పోసింది. ఇదిలా ఉంటే, మొదట్నుంచీ కాస్త బొద్దుగా ఉండే విద్యాబాలన్ ఈ మధ్య ఇంకొంచెం బరువు పెరిగింది.
ఈ కారణంగా ఆమె కొన్ని రకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సహజంగా హీరోయిన్స్ అంటే సన్నజాజి నడుముతో స్లిమ్‌గా మాత్రమే ఉండాలి అనే అభిప్రాయముంది మనకు. కానీ, విద్యాబాలన్ మాత్రం అందుకు అతీతురాలు. ఆమెకు బరువుతో సంబంధం లేకుండానే అవకాశాలు వరిస్తుంటాయి. ఎంత అవకాశాలు వచ్చినా కానీ, అవమానాల్ని ఎదిరించడం ఆమె వల్ల కావడం లేదు. అలా అని ఆ పెరిగిన బరువును తగ్గించుకోవడం కూడా కుదరడం లేదట. అందుకే విద్యాబాలన్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తనలాగే బాడీ షేమింగ్‌పై బాధపడేవారికి స్ఫూర్తినిచ్చేలా, తనవంతు సాయమందించేలా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రముఖ రేడియోస్టేషన్ బిగ్ ఎఫ్ ఎమ్‌తో కలిసి ఓ నూతన కార్యక్రమానికి విద్యాబాలన్ శ్రీకారం చుట్టింది. 'దున్ బదల్ కే దేఖో' అనే ఈ కార్యక్రమం ద్వారా బాడీ షేమింగ్ సంఘటనలు ఎదుర్కొన్నవారు తమ తమ సమస్యలు షేర్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విద్యా ఓ ఎమోషనల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌కి నెటిజన్స్ నుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
Here's Vidya's take on Body Shaming- the phenomenon of receiving cruel feedback when our bodies don’t meet the unrealistic beauty standards. Tune into '#MuthootBlue #DhunBadalKeTohDekho with @vidya_balan presented by Muthoot Fincorp'. @MuthootIndia #VWash #KhudSeKhudKaRishta pic.twitter.com/Vq0nUDrxBb
— 92.7 BIG FM (@bigfmindia) May 25, 2019