మహర్షీ.. 'సరిలేరు నీకెవ్వరు'!

By iQlikMovies - May 31, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

'మహర్షి' ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రానికి టైటిల్‌ కన్‌ఫామ్‌ చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ ప్రస్తుతం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. గత కొంత కాలంగా ఈ టైటిల్‌పై విసృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదే టైటిల్‌ని చిత్ర యూనిట్‌ కన్‌ఫామ్‌ చేసింది. టైటిల్‌లో క్లాసిక్‌ సౌండ్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఎట్రాక్ట్‌ చేసేలా ఉంది.

 

'మహర్షి'తో రైతు సమస్యలు.. అంటూ ఓ సోషల్‌ మెసేజ్‌ని పాస్‌ చేసిన మహేష్‌బాబు, ఈ సినిమాతో ఏం చేస్తాడో కానీ, ఇదో ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ అనీ తెలుస్తోంది. ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌కి అనిల్‌ రావిపూడి పెట్టింది పేరు. అదే ఫార్ములాతో వరుసగా హిట్స్‌ మీద హిట్స్‌ కొడుతూ వస్తున్నాడాయన. ఈ ఏడాది ఆల్రెడీ 'ఎఫ్‌ 2'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఆయన ఖాతాలో ఉంది.

 

ఇక ఇప్పుడు మహేష్‌తో చేయబోయే సినిమా పైనా అంచనాలు ఘనంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్‌ అని ముందే అంచనా వేస్తున్నారు మహేష్‌ అభిమానులు. అంతేకాదు, అనిల్‌తో సినిమా అంటే చాలా తక్కువ టైంలోనే కంప్లీట్‌ అయిపోతుంది. సెట్స్‌ మీదికెళ్లడమే తరువాయి. సో ఈ లెక్కల్లో ఈ ఏడాది చివరిలోనే అనిల్‌ - మహేష్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఈ ఏడాది మహేష్‌ డబుల్‌ ధమాకా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS