బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అది కూడా సౌత్ సినిమాల కోసం. ఈ మధ్య సౌత్‌లో బయోపిక్స్ హవా బాగా నడుస్తోంది. తెలుగులో 'మహానటి' సినిమా తర్వాత బయోపిక్స్ అంటే భయపడే చాలా మందిలో ఆ భయం పోయినట్లైంది. దాంతో రకరకాల బయోపిక్స్ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో మాజీ ముఖ్యమంత్రి, నటుడు, లెజెండ్ స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
అలాగే తమిళంలో లెజెండరీ నాయకురాలైన జయలలిత బయోపిక్ కూడా తెరకెక్కుతోంది. బయోపిక్స్ అంటే, ఆయా పాత్రలను పోషించే నటీ,నటులు అచ్చం ఒరిజినల్ క్యారెక్టర్స్‌ని నేచురల్‌గా మ్యాచ్ చేసేలా ఉండాలి. అందుకు తగ్గట్లుగానే ఆయా పాత్రల కోసం నటీనటుల్ని ఎంచుకుంటూ ఉంటారు దర్శక, నిర్మాతలు. తాజాగా ఈ బయోపిక్స్‌కి సంబంధించే విద్యా బాలన్ పేరు వినిపిస్తోంది.
ఇక్కడ తెలుగులో 'ఎన్టీఆర్' బయోపిక్‌లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం విద్యా బాలన్‌ని ఎంచుకున్నారంటూ గత కొంతకాలంగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆఫీషియల్‌గా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ప్రకటించలేదు కానీ, మరో తమిళంలో జయలలిత బయోపిక్ కోసం కూడా విద్యాబాలన్ పేరే వినిపిస్తోంది. విద్యాబాలన్ మంచి నటి. హుందా అయిన పాత్రలే కాదు, గ్లామర్ పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోతుంది.
'డర్టీ పిక్చర్' సినిమాలో విద్యాబాలన్ పాత్ర విమర్శలు అందుకున్నా, ఆ పాత్రలో నటించి మెప్పించడం మరో హీరోయిన్ తరం కాదేమో అనిపిస్తుంది. అందుకే విద్యా ది స్పెషల్. సౌత్‌లో ఆమె పేరు వినిపించడానికి కారణం అదే. ఏమో చూడాలి మరి, అసలు విద్యాబాలన్ ఈ బయోపిక్స్‌లో నిజంగానే నటిస్తుందా? లేదా? అనేది.