స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి స్వర్గీయ 'బసవ తారకం' ఎలా ఉంటుందో పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, 'ఎన్టీఆర్' బయోపిక్‌లో బసవతారకం పాత్ర పోషించి ఆ మహాతల్లి అచ్చంగా ఇదిగో ఇలాగే ఉంటుంది అని తెలుగు వారికి చూపించిన ఘనత దక్కించుకుంది విద్యాబాలన్. ఇలాంటి ఓ గొప్ప పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమా విజయం సాధించకపోయినా, బసవతారకం పాత్ర తెలుగు వారిలో చాలా ఇంపాక్ట్ చూపించింది. చెరగని ముద్ర వేయించుకుంది ఆ పాత్రతో విద్యాబాలన్.
అప్పుడెప్పుడో హాట్ ఐటెం బాంబ్ సిల్క్‌స్మిత బయోపిక్ 'డర్టీ పిక్చర్'లో నటించి సెన్సేషన్ అయ్యింది. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు. ఏకంగా మూడు బయోపిక్స్‌లో విద్యాబాలన్ నటించి మెప్పించింది. క్లాస్, మాస్, హాట్ అండ్ ట్రెడిషనల్.. ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల టాలెంటెడ్ నటి విద్యా బాలన్. ఫిజిక్, ఫిగర్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్.
అలాంటి విద్యాబాలన్ ఖాతాలో తాజాగా మరో బయోపిక్ వచ్చి చేరింది. 'హ్యూమన్ కంప్యూటర్'గా పేరున్న 'శకుంతలా దేవి' బయోపిక్‌లో విద్యా బాలన్ నటించనుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్‌గా లండన్‌లో స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేస్తూ, చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్ లోగోని రిలీజ్ చేసింది. సింపుల్ బాబ్డ్ హెయిర్‌లో రెడ్ శారీ ధరించి చేతులు కట్టుకుని స్టైల్‌గా స్మైల్ ఇస్తున్న విద్యా బాలన్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అనూమీనన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
The only way to define her mathematical genius: ∞. #ShakuntalaDevi@vidya_balan @anumenon1805 @vikramix @SnehaRajani @Abundantia_Ent pic.twitter.com/NGhnzzVYg8
— SPN Productions (@sonypicsprodns) September 16, 2019