ఎఫ్ 2తో ఓ సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు అందుకుంది. దాంతో వరుణ్ సినిమా బిజినెస్‌లూ పెరిగాయి. తన తాజా చిత్రం వాల్మీకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 24.25 కోట్లకు అమ్ముడైంది. సోలో హీరోగా వరుణ్‌కి ఇదే బెస్ట్ అనుకోవొచ్చు. నైజాంలో ఈ సినిమాని 7.4 కోట్లకు కొన్నారు. సీడెడ్‌లో 3.4 కోట్లు పలికింది. ఆంధ్రాలో 9 కోట్లకు అమ్ముడైంది. ఓవర్సీస్ 2.2 కోట్లు వచ్చింది. మొత్తానికి ఇది క్రేజీ ప్రీ రిలీజ్ బిజినెస్సే. శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కలుపుకుంటే.. వాల్మీకికి టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే లెక్క.