'రౌడీ' బర్త్‌డే స్పెషల్‌ ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

హా.! ఏముంటుంది.. సెట్స్‌లో ఉంటే టీమ్‌తో కలిసి కేక్‌ కట్‌ చేస్తాడు. ఇంట్లో ఉంటే, ఫ్యామిలీ మెంబర్స్‌తో.. ఫ్రెండ్స్‌తో ఉంటే పార్టీలో కేక్‌ కటింగ్‌ ఇంతేగా ఇంకేముంటుంది.. అనుకుంటున్నారా.? అయితే తప్పులో కాలేసినట్లే. విజయ్‌ దేవరకొండ విషయంలో అంత తేలిగ్గా ఎలా ఆలోచిస్తారండీ.. మనోడు మామూలోడా.? కానే కాదు. రౌడీ.. అంతే. కానీ మంచి రౌడీలెండి. తన బర్త్‌డేని కేక్‌ కటింగ్స్‌ జస్ట్‌ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, మూవీ టీమ్‌తోనే సరిపెట్టకుండా, పెద్ద మనసు చేసుకుని వేసవితాపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు.

 

అసలు సిసలు తెలంగాణా పోరడు అయినా, విజయ్‌ తన ఆటిట్యూడ్‌తో తెలుగు రాష్ట్రాలు రెండింట్లోనూ, ఆ మాటకొస్తే, సౌత్‌ మొత్తాన్నీ ఆకర్షించేశాడు. ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఈ రోజు అంటే మే 9న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కి హిమ క్రీములు పంపిణీ మొదలు పెట్టాడు. ఏదో ఒక ప్రాంతానికే మన విజయ్‌ దేవరకొండ ఐస్‌ క్రీములు పరిమితం కాలేదండోయ్‌. ఏకంగా సౌత్‌ మొత్తాన్నీ కవర్‌ చేసేసినట్లున్నాడు. హైద్రాబాద్‌, వరంగల్‌, తిరుపతి, విజయవాడ, బెంగుళూర్‌, కొచ్చి.. తదితర బడా నగరాల్లో విజయ్‌ దేవరకొండ బర్త్‌డే ఐస్‌ క్రీమ్‌ ట్రక్కులు తిరుగుతున్నాయన్న మాట.

 

మొత్తానికి మనోడు చల్లని మనసు చేసుకుని అందిన వారికి కొందరికైనా వేసవి తాపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడన్న మాట. దటీజ్‌ విజయ్‌ దేవరకొండ. విజయ్‌ దేవరకొండ బంగారు కొండే కాదు, హిమాలయాల్లా చల్లని కొండ కూడా. ఇంత చల్లని మనసున్న మన విజయ్‌దేవరకొండకు మనం కూడా బర్త్‌డే విషెస్‌ చెప్పేయాలి కదా.. హ్యాపీ బర్త్‌డే టు విజయ్‌ దేవరకొండ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS