'ఫైటర్‌'లో విజయ్‌ దేవరకొండ పాత్ర అదేనా.?

మరిన్ని వార్తలు

'డియర్‌ కామ్రేడ్‌' అంటూ వచ్చి నిరాశ పరిచాడు రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండ. 'కామ్రేడ్‌' తర్వాత విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'ఫైటర్‌' అని తెలిసిన సంగతే. ఇస్మార్ట్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రేపో మాపో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడనే గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అందుకోసం మన రౌడీస్టార్‌ కసరత్తులు చేసి, కండలు పెంచేస్తున్నాడట.

 

ఇంతవరకూ చూడని మేకోవర్‌తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. అసలే అది పూరీ సినిమా. అందులోనూ ఆటిట్యూడ్‌ కా బాప్‌ మనోడు. ఈ ఇద్దరి కాంబో మూవీ అంటే ఓ రేంజ్‌లో ఉండనే ఉంటుంది మరి. ఇదిలా ఉంటే, ఆల్రెడీ స్టార్ట్‌ అయిన విజయ్‌ దేవరకొండ 'హీరో' మూవీ ఎంతవరకూ వచ్చిందనే సంగతి తెలీదు. ఈ సినిమాకి సంబంధించి రకరకాల గాసిప్స్‌ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సినిమా ఆగిపోయిందనీ, లేదు కామ్‌గా షూటింగ్‌ జరిగిపోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆనంద్‌ అన్నామలై ఈ సినిమాకి దర్శకుడు. ఇదో ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమనీ, విజయ్‌ దేవరకొండ కెరీర్‌కి బాగా ఉపయోగపడే చిత్రమనీ అంటున్నారు.

 

సబ్జెక్ట్‌ నచ్చి విజయ్‌ దేవరకొండ ఇష్టపడి ఈ సినిమాని ఎంచుకున్నాడట. అందుకే ఈ సినిమాని ఎలాగోలా కంప్లీట్‌ చేయాలనే యోచనతో ఉన్నాడనీ తెలుస్తోంది. నిర్మాతల మధ్య వచ్చిన డిస్ట్రబెన్స్‌ కారణంగా సినిమా సగంలో ఆగిపోయిందట. వారిని సముదాయించి విజయ్‌ దేవరకొండ పరిస్థితిని చక్కబరిచాడనీ, సినిమా షూటింగ్‌ సజావుగా సాగుతోందనేది లేటెస్ట్‌ అప్‌డేట్‌. పూర్తి క్లారిటీ రావాలంటే సినిమా నుండి ఏదో ఒక అప్‌డేట్‌ ఇవ్వాల్సి ఉంది మన రౌడీస్టార్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS