'బిగ్‌' ఇరిటేట్‌ చేస్తున్న హిమజ!

మరిన్ని వార్తలు

బిగ్‌ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ గెలిచి వితిక ఇంటి కెప్టెన్‌గా ఎంపికైంది. స్వయంగా తన భర్తే భుజాలపై మోసుకెళ్లి మరీ కెప్టెన్సీని కట్టబెట్టాడు వితికకు. ఇది నిజంగా అద్భుతం. అందుకే వితిక చాలా చాలా ఖుషీ అయ్యింది. భార్య కోరిక తీర్చి, సంతోషపెట్టినందుకు తాను కూడా హ్యాపీ ఫీలయ్యాడు వరుణ్‌. కెప్టెన్‌ అయిన వితిక ఆనందానికి అవధుల్లేవ్‌. చాలా ఎగ్జైట్‌ అయ్యింది. అయితే కెప్టెన్సీని దక్కించుకునేందుకు అందరి కంటే ఎక్కువ ఆరాటపడిన హిమజకు మెజార్టీ ఓట్లు దక్కకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది.

 

అందర్నీ ముఖం మీదే అడిగేస్తోందట తనకెందుకు ఓట్లు వేయలేదని. ఈ విషయాన్ని హౌస్‌ మేట్స్‌ ఒకరితో ఒకరు చర్చంచుకుని ఇరిటేట్‌ అవుతున్నారు. ఎవరికి ఓట్లు వేయాలనేది వారి పర్సనల్‌. అలాంటిది హిమజ డైరెక్ట్‌గా ముఖాన అడిగేసరికి అందరూ విస్తుపోతున్నారు. మొదటి నుండీ హిమజ ఆటిట్యూడ్‌ కొంచెం వింతగానే ఉంటోంది. ఎప్పుడు జోక్‌ వేస్తుందో, ఎప్పుడు సీరియస్‌ అవుతుందో అర్ధం చేసుకోలేకపోతున్నామంటూ హౌస్‌ మేట్స్‌ నుండి హిమజపై ఆరోపణలు ఉన్నాయి.

 

తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో చోటు చేసుకున్న ఈ వింత పరిణామాలకు హౌస్‌మేట్స్‌లో హిమజ పట్ల ఉన్న ఆ అభిప్రాయం మరింత బలంగా మారింది. మరోవైపు శీముఖి కూడా కెప్టెన్సీ విషయంలో ఎక్కువగానే ఎక్స్‌పెక్ట్‌ చేసింది. కానీ, గెలవలేకపోయింది. కెప్టెన్సీ కోసం రవి హెల్ప్‌ తీసుకున్న శ్రీముఖికి రవి తనవంతు సాయం అందించాడు కానీ, సాధ్యం కాలేకపోయింది రవికి. శ్రీముఖిని ఎత్తుకొని, తనవంతుగా చాలా కష్టపడ్డాడు రవి. అంత వెయిట్‌ ఉన్న శ్రీముఖిని అంత సేపు తన భుజాలపై మోసి పరుగెత్తడంతో తీవ్రమైన ఆయాసానికి గురయ్యాడు రవి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS