ప్రతీయేటా... అత్యధిక సంపాదన గలిగిన సెలబ్రెటీ జాబితాని ఫోర్బ్స్ సంస్థ ప్రకటిస్తుంటుంది. 2018 సంవత్సరానికి గానూ.. ఫోర్బ్స్ ఇప్పుడో జాబితా విడుదల చేసింది. అందులో.. సెలబ్రెటీ లిస్టులో బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ అగ్ర స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ యేడాది సల్మాన్ వార్షికాదాయం ఏకంగా రూ.253.25 కోట్ల గా నమోదైంది.
ఆ తర్వాతి స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ(రూ.228.09 కోట్లు) ఉన్నాడు. టాప్ 20లో టాలీవుడ్ కథానాయకులెవరికీ చోటు దక్కలేదు. 24 స్థానంలో పవన్ కల్యాణ్, 28వ స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. మహేష్‌బాబుకి 33 వ స్థానం దక్కింది.
స్థానాల వారీగా టాలీవుడ్ సెలబ్రెటీల లిస్టు ఇది
24) పవన్ కల్యాణ్ (రూ.31.33 కోట్లు)
28) ఎన్టీఆర్ (రూ.28 కోట్లు)
33) మహేశ్ బాబు (రూ.24.33 కోట్లు)
36) నాగార్జున (రూ.22.25 కోట్లు)
39) కొరటాల శివ (రూ.20 కోట్లు)
64) అల్లు అర్జున్ (రూ.15.67 కోట్లు)
72) రామ్‌చరణ్ (రూ.14 కోట్లు)
72) విజయ్ దేవరకొండ (రూ.14 కోట్లు)