ముద్దు సీన్లతోనే సెన్సేషనల్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ సినిమా అంటే, ముద్దులు.. కాదు, కాదు గాఢమైన ఘాటు ముద్దులుండాల్సిందే. 'అర్జున్‌రెడ్డి'తో మొదలెట్టిన ఈ ముద్దుల పర్వం, వరుసగా 'గీత గోవిందం', లేటెస్ట్ మూవీ 'డియర్ కామ్రేడ్' వరకూ కంటిన్యూ అయ్యింది. ఈ లిప్లాక్స్తోనే మనోడు యూత్‌లో క్రేజీయెస్ట్ హీరో అయిపోయాడు.
'డియర్ కామ్రేడ్' వరల్డ్ వైడ్‌గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిజల్ట్ ఏంటనేది తెలియాలంటే సాయంత్రం వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్ట్స్ మన రౌడీ బాబు చేయాల్సిన చిత్రం 'హీరో'. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఎప్పుడో ఆగిపోయిందనే గాసిప్స్ వినిపించాయి. కానీ, సినిమా ఆగిపోలేదట. 'డియర్ కామ్రేడ్' కోసం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారట. 'డియర్ కామ్రేడ్' హడావిడి అయిపోగానే 'హీరో' సినిమాపై కాన్సన్ట్రేషన్ చేయనున్నారనేది తాజాగా అందుతోన్న సమాచారం. ఇకపోతే, ఈ సినిమాకి సంబంధించి ఇంకో ఆసక్తికరమైన విషయం హాట్ హాట్‌గా నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అయితే, దట్స్ ఇంపాజిబుల్. ఇంతకీ అసలు విషయమేంటంటే, 'హీరో' సినిమాలో అసలు ముద్దుల గోలే ఉండదంట నమ్ముతారా? అస్సలు నమ్మలేని నిజం కదా ఇది. కానీ, లిప్‌లాక్స్ విషయంలో చాలా కష్టపడాల్సి వస్తోందని ఇటీవల 'డియర్ కామ్రేడ్' ప్రమోషన్స్‌లో మన రౌడీ కూడా చెప్పాడు కదా. సో ఇప్పటికైతే నమ్మాలి. ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆనంద్ అన్నమలై ఈ సినిమాకి దర్శకుడు. ఒకవేళ అన్నీ కుదిరి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకుంటే, మన రౌడీ స్టార్ ఈ సినిమాలో బుద్ధిమంతుడైన 'హీరో'గా కనిపిస్తాడేమో చూడాలిక.