రౌడీ సినిమాకి ఈ సారి 'ఆ' బెడద లేదోచ్‌!

మరిన్ని వార్తలు

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఈరోజు 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రీమియర్స్‌తో మనోడు చితక్కొట్టేశాడనే టాక్‌ వినిపిస్తోంది. ఇంకో పక్క మిశ్రమ స్పందన కూడా వస్తోంది ఈ సినిమాపై. అయితే, ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్‌ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ వచ్చేలా చేస్తాయనడం అతిశయోక్తి కాదేమో. ఇదిలా ఉంటే, షూటింగ్‌కి చాలా ఎక్కువ టైం తీసుకున్న ఈ సినిమాకి ఈ సారి లీకుల బెడద పెద్దగా తగల్లేదు.

 

అఫీషియల్‌గా రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాలు తప్ప, లీకేజీ న్యూసేమీ బయటికి రాలేదు 'డియర్‌ కామ్రేడ్‌' సినిమా గురించి గతంలో విజయ్‌ నటించిన 'టాక్సీవాలా' సినిమా మొత్తం డిజిటల్‌ ప్రింట్‌ లీక్‌ అయిపోయి, విజయ్‌ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అఫ్‌ కోర్స్‌ విడుదలయ్యాక ఆ సినిమాతోనూ మన రౌడీ హిట్‌ కొట్టి తన స్టామినా ప్రూవ్‌ చేసుకున్నాడనుకోండి.

 

ఇప్పుడు 'డియర్‌ కామ్రేడ్‌' విషయంలో, 'లీకుల తాకిడి తగలకుండా, నా సినిమా డైరెక్ట్‌గా ధియేటర్స్‌లో విడుదలవుతోంది హమ్మయ్యా..' అంటూ ఊపిరి పీల్చుకున్నాడు మన రౌడీ స్టార్‌. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, హీరోయిన్‌గా నటిస్తున్న రష్మికా క్రికెటర్‌ పాత్రలో కనిపిస్తోంది. చాలా ఎగ్రెసివ్‌గా కనిపించే కుర్రాడి పాత్రలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రూపొందించిన ఈ సినిమాకి భరత్‌ కమ్మ దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS