విజయ్ దేవర కొండ జూనియర్ పవనా?

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాంచి ఊపులో వున్న రోజుల్లో ఆయన్ని ఎప్పుడు మాట్లాడించిన ఓ కామన్ డైలాగ్ వచ్చేది. ''నేను ఎప్పుడు సినిమాలు మానేస్తానోతెలీదు. సినిమా అంటే పెద్ద వ్యామోహం లేదు నాకు. నేను చేయాల్సిన పని ఇది కాదు'' ఇలా ఉండేవి పవన్ కళ్యాణ్ మాటలు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇలానే మాట్లాడుతున్నాడు. 'యాక్టింగ్ నుంచి తానెప్పుడైనా రిటైర్‌ అవ్వచ్చని' చెబుతున్నాడు .

 

''నేను ఎప్పుడైనా యాక్టింగ్ కి గుడ్ బై చెప్పొచ్చు. నాకు సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా.. చేసిందే చేస్తున్నానిపించి బోర్‌ కొట్టినా వెంటనే యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తాను' అంటున్నాడు విజయ్. విజయ్ ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు.

 

అర్జున్ రెడ్డి తర్వాత ఒక రోజు మా అమ్మకి జ్వరం వచ్చిందని, తనని హాస్పిటల్ కి తీసుకెలుతున్న క్రమంలో .. ఇక ఈ నటన వద్దు అనుకున్నానని, ఎందుకు వచ్చిందో తెలీదు కానీ ఆ రోజు తన మనసులో ఇంక ఈ యాక్టింగ్, సినిమాలు వద్దు అనుకున్నానని చెప్పాడు విజయ్. ఎందుకు అలా అనిపించిందంటే మాత్రం దానికి రీజన్ తెలియదని చెప్పాడు. పవన్ కళ్యాణ్ మాటలు కూడా అచ్చు ఇలానే వుంటాయి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS