విజయ్, రష్మిక ఒక్కటి కాబోతున్నారా?

మరిన్ని వార్తలు

విజయ్ దేవరకొండ, రష్మిక అన్ స్క్రీన్ కాదు.. అఫ్ స్క్రీన్ కూడా క్రేజీ జోడి. 'గీత గోవిందం'లో కలసి నటించిన వీరిద్దరిమధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఇది కేవలం స్నేహం మాత్రమే కాదని మరో అడుగుముందుకు వేసి వీరిద్దరు లైఫ్ పార్టనర్స్ కూడా కాబోతున్నారని ప్రచారం జరుగుతుంది, లేటెస్ట్ టాక్ ఏమిటంటే .. వీరిద్దరు ఈ ఏడాది చివరికి మూడముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారని ఇన్ సైడ్ టాక్.

 

విజయ్, రష్మిక తమ బంధం పై బయటికి చెప్పకపోయిన వారి మధ్య రిలేషన్ చాలా సందర్భాల్లో బయటపడుతూనే వుంది. రష్మిక తరుచు విజయ్ ఇంటికి వెళ్ళడం మీడియా కంటపడింది. ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్. దిని కోసం ఎక్కువగా ముంబాయ్ లో గడిపాడు. ఈ సినిమాకి రష్మిక కి ఎలాంటి సంబంధం లేదు. కానీ వారాలు పాటు ముంబాయి లో విజయ్ తో పాటు కనిపించింది రష్మిక. అంతేకాదు విజయ్ తమ్ముడు ఆనంద్ .. ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..రష్మిక తమ ఫ్యామిలీతో వుందని హింట్ ఇచ్చాడు.

 

ఇవన్నీ కూడా వారి రిలేషన్ షిప్ కు బలాన్ని చేకూర్చే విషయాలే. ఇక క్రేజ్ పరంగా తీసుకున్నా విజయ్, రష్మిక మంచి ఫామ్ లో వున్నారు. పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టింది రష్మిక. విజయ్ లైగర్ పాన్ ఇండియా టార్గెట్ గా విడుదలకు సిద్దమౌతుంది. ఈ జంట ఒక్కటైతే చూడాలనివుందని అటు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరికల్లా విజయ్- రష్మిక నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం వుందని తెలుస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS