యాక్షన్‌లోకి దిగిన 'రౌడీస్‌'

మరిన్ని వార్తలు

'ట్యాక్సీవాలా' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. సినిమా రిలీజ్‌కి ఒక రోజు ముందు రౌడీస్‌ హంగామా సోషల్‌ మీడియాలో షురూ అయ్యింది. ఇంత ఆలస్యం ఎందుకయ్యిందనే విషయం పక్కన పెడితే, రౌడీస్‌ యాక్షన్‌లోకి దిగింది మొదలు సోషల్‌ మీడియాలో 'ట్యాక్సీవాలా' హ్యాష్‌ ట్యాగ్‌ మార్మోగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే 'ట్యాక్సీవాలా' పేరు హోరెత్తిపోతుందనడం సబబేమో. రౌడీస్‌ హంగామా ఆ రేంజ్‌లో వుంటుంది మరి.

'నోటా' దెబ్బకి విజయ్‌ దేవరకొండతోపాటు అతని అభిమానులైన 'రౌడీస్‌' కూడా డీలాపడ్డారు. పైగా, 'ట్యాక్సీవాలా' సినిమా విడుదలకు ముందే లీక్‌ కావడంతో 'రౌడీస్‌' దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి విజయ్‌ దేవరకొండకే కాదు, రౌడీస్‌కి కూడా చాలా టైమే పట్టింది. నిన్న మధ్యాహ్నం నుంచీ రౌడీస్‌, 'ట్యాక్సీవాలా'కి అనుకూలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం ముమ్మరం చేశారు. రాత్రంతా రౌడీస్‌కి నిద్ర పట్టలేదనడం అతిశయోక్తి కాదేమో.

రాత్రంతా సినిమాని ప్రమోట్‌ చేస్తూనే వున్నారు. సినిమా సూపర్‌ హిట్‌.. అంటూ సోషల్‌ మీడియాలో రౌడీస్‌ హల్‌చల్‌ జరుగుతూనే వచ్చింది. ఇటీవలి కాలంలో అనూహ్యంగా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న విజయ్‌ దేవరకొండ, ఇంతమంది అభిమానుల అభిమానం పొందడమంటే మాటలు కావు. 'నోటా' దెబ్బకొట్టిందిగానీ, లేకపోతే.. 'ట్యాక్సీవాలా' హంగామా ఇంకో రేంజ్‌లో వుండేది.

ఏదిఏమైతేనేం, 'అత్తారింటికి దారేది'లా 'ట్యాక్సీవాలా' విడుదలకు ముందే లీక్‌ అయినా, సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు 'రౌడీస్‌'. అది నిజమయ్యేనా? కాస్సేపాగితే రిజల్ట్‌ తెలిసిపోతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS