రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమ గూర్చి ఇండస్ట్రీలో రోజు కొక వార్త చక్కర్లు కొడుతూ వుంటుంది. వీరి జోడికి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఎప్పుడూ వీరి ప్రేమను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ పెళ్లితో ఈ పుకార్లకు చెక్ పెట్టనున్నారని తాజా సమాచారం. విజయ్, రష్మిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరి రెండో వారంలోనే వీళ్ల నిశ్చితార్థం అని టాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
విజయ్ , రష్మికలు త్వరలోనే తమ ఎంగేజ్మెంట్ న్యూస్ ని అనౌన్స్ చేయనున్నారని కూడా టాక్ నడుస్తోంది. ప్రేమ విషయంలో సీక్రేసీని మెయిన్ టైన్ చేసిన ఈ జంట ఇప్పుడు పెళ్లి, నిశ్చితార్థం విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారా? అని పలువురు గుస గుసలాడుతున్నారు. రీసెంట్ గా వీరిద్దరూ మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లి వచ్చిన ఫొటోస్, హాయ్ నాన్న ప్రీరిలీజ్ ఈవెంట్లో సడెన్ గా ప్రత్యక్షమై అందర్నీ విస్మయానికి గురి చేశాయి. వేరే వాళ్ళ మూవీ ఈవెంట్లో వీళ్ల పబ్లిక్ ఫొటోస్ ప్రత్యక్షం కావడం పెద్ద దుమారం రేపినా, వీళ్ల మధ్య రిలేషన్షిప్ గూర్చి క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఫాన్స్ మాత్రం వీరు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారని వెయిట్ చేస్తున్నారు.